తాండూరు RTC డిపోలో ‘Dial Your DM’

వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోలో బుధవారం ‘Dial Your DM’ కార్యక్రమం నిర్వహించనున్నారు. బస్సు సర్వీసులు, ప్రయాణ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఇతర సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ అవకాశం కల్పించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణికులు 9063469572 నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలు, సూచనలు తెలియజేయాలని డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


