ప్రజలకు షాక్.. పెరగనున్న ఆస్తి పన్ను భారం

TG: హైదరాబాద్‌లో ఆస్తి పన్నుపై ప్రభుత్వం మార్పులు చేసింది. అసెంబ్లీలో ఆమోదించిన 'కోర్ అర్బన్ రీజన్ బిల్లు-2026' ప్రకారం, ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా.. ఆస్తి పన్ను ఉంటుంది. దీనివల్ల టాక్స్ పెరగనుంది. ఆ భారాన్ని ఒకేసారి వేయకుండా ఏటా మాగ్జిమం 20 పర్సెంట్ పెంచుతారు. 375 చదరపు అడుగుల లోపు ఇళ్లకు 101 రూపాయల టాక్స్ ఉంటుంది. సైనికులు, మాజీ సైనికులకు పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రతి ఆస్తికీ QR కోడ్ ఇస్తారు. ఖాళీ స్థలాలపై 0.50 శాతం టాక్స్, అక్రమ నిర్మాణాలపై 300 శాతం ఫైన్ విధిస్తారు.


