← Back to news

మటన్ మండిలో పంటి ముక్క.. Complaint చేసినా నో యాక్షన్?

By Mahesh· 1h ago· ABN· హైదరాబాద్
మటన్ మండిలో పంటి ముక్క.. Complaint చేసినా నో యాక్షన్?

TG: హైదరాబాద్ మాదాపూర్‌లోని ది జాయింట్ అల్ మండి రెస్టారెంట్‌లో ఫుడ్ క్వాలిటీపై వివాదం నెలకొంది. మటన్ మండి తింటుండగా ఫుడ్‌లో పంటి ముక్క కనిపించిందని ఓ కస్టమర్ ఆరోపించారు. మేనేజ్‌మెంట్‌ను ఇదేంటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటావో చేసుకో, ఎక్కడైనా కంప్లైంట్ చేసుకో అని బెదిరించిందని అన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, సెటిల్‌మెంట్ చేసుకోవాలని సూచించారని ఆరోపించారు. ఈ ఘటనపై పై ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేశారు.

More in TG