← Back to news

మండీ బిర్యానీ తిని మృతి.. పలువురు అస్వస్థత

By Sharmila· 2h ago
మండీ బిర్యానీ తిని మృతి.. పలువురు అస్వస్థత

TG:మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మంగళవారం వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో మండీ బిర్యానీ తిన్న పలువురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ సాయిరాం (19) అనే యువకుడు మృతి చెందాడు. మరో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. రెస్టారెంట్‌లో తిన్న ఆహారం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

More in TG