← Back to news

వర్షం కోసం ఎదురుచూపులు.. ఎండుతున్న పత్తి పంటలు

By A.Ajay· 3h ago
వర్షం కోసం ఎదురుచూపులు.. ఎండుతున్న పత్తి పంటలు

TG : ముథోల్ నియోజకవర్గంలో వర్షాలు సకాలంలో కురవక పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి 20 వేల నుంచి 25 వేల వరకు ఖర్చు చేస్తున్నామని, ఆశించిన వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశిస్తారు. పంట దెబ్బతింటే అప్పులు తీర్చడం కష్టమవుతుందని అంటున్నారు. అధికారులు గ్రామాల వారీగా పంటలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు.

More in TG