← Back to news

EMI చెల్లించనందుకు..యువకుడి రక్తం తీసుకున్నారు

By Vishi· 2h ago· Indiatoday
EMI చెల్లించనందుకు..యువకుడి రక్తం తీసుకున్నారు

UP రాజధాని లక్నోలో మొబైల్ ఫోన్ EMI చెల్లించలేకపోయిన యువకుడిని రికవరీ ఏజెంట్లు కిడ్నాప్ చేసి, అతని రక్తం తీసుకున్నారు. నావల్ కుమార్ గతేడాది 21,500 రూపాయల విలువైన మొబైల్ ఫోన్‌ జీరో డౌన్ పేమెంట్‌పై కొన్నాడు. EMI కట్టలేకపోవడంతో అతణ్నుంచి ఫోన్‌ తిరిగి తీసుకున్నారు. అయితే సెప్టెంబర్ 8న రికవరీ ఏజెంట్ షుభం సింగ్, అతని సహచరులు నావల్‌ను కిడ్నాప్ చేసి బ్లడ్ బ్యాంక్‌కు తీసుకెళ్లి బలవంతంగా రక్తం తీయించారు. ఆ తర్వాత అతని ఇంటి నుంచి డబ్బు డిమాండ్ చేశారు. అతని కుటుంబం పోలీసులకు చెప్పడంతో నావల్‌ను వదిలేశారు.

More in National