పోలీసుల లాఠీఛార్జ్‌పై ర్యాప్ సాంగ్ వైరల్!
జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ప్రొటెస్ట్‌పై ర్యాపర్ 'గరం కలాకార్' పాడిన ర్యాప్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులపై పోలీసులు, సివిల్ డ్రెస్‌లో ఉన్న గుండాలు ప్రదర్శించిన బలప్రయోగాన్ని, లాఠీఛార్జ్ ప్రయోగాన్ని తన పాట ద్వారా ఆయన తీవ్రంగా నిరసించారు. మీడియా, ప్రభుత్వం ఈ అంశంపై మౌనంగా ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులను మోసం చేసిన ఫలితం రాబోయే 2029 ఎన్నికల్లో కనిపిస్తుందని ర్యాపర్ పాటలో హెచ్చరించారు.



