← Back to news

దారితప్పిన ఏనుగు.. రాత్రంతా బీభత్సం

By Kavyamani· 21 Aug 2026· Samudrapalle, Palamaner, Chittoor

ఓ ఏనుగు తన మంద నుంచి వేరుపడింది. దారి తప్పింది. పలమనేరు రూరల్ మండలంలోని ఇందిరానగర్ పంట పొలాల్లోకి వెళ్లింది. అర్థరాత్రి తరువాత గుడియాత్తం రోడ్డుపైకి ఎక్కి, భయంకరంగా అరుస్తూ అక్కడున్న ట్రాకర్స్‌పైకి దూసుకెళ్లింది. గ్రామస్తులు, రైతులంతా ఆ ఏనుగును టపాసులు, బాణాలు, ఔట్లు పేల్చుతూ ఏనుగును పొలాల మీదుగా, రోడ్డు పక్కనే ఉన్న అడవి వైపు మళ్లించారు. గతంలో ఏర్పాటు చేసిన హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్‌ను విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ ఏనుగు కాళ్లతో తొక్కి ధ్వంసం చేసింది.

More in Local