← Back to news

చిరుతిళ్ల తయారీ కేంద్రాలపై తనిఖీలు చేయాలి

By KANKANALA VENUGOPAL RAO· 1d ago· Karimnagar, Karimnagar, Karimnagar
చిరుతిళ్ల తయారీ కేంద్రాలపై తనిఖీలు చేయాలి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిక్చర్, చెకోడీస్, బూందీ వంటి చిరుతిళ్ల తయారీలో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హనుమాన్ నగర్ కాలనీలో జి.పి. గ్రౌండ్ సమీపంలో, కట్టా రాంపూర్‌లోని జాస్ బేకరీకి చెందిన తయారీ కేంద్రంలో కృత్రిమ రంగులు వాడుతున్నారని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. నూనె నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తనిఖీలు నిర్వహించి, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

చిరుతిళ్ల తయారీ కేంద్రాలపై తనిఖీలు చేయాలి

More in Local