ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సేవలు: కలెక్టర్

ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా శనివారం బీఆర్ స్టేడియంలో రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరం ప్రారంభించిన కలెక్టర్, నిత్యం పని ఒత్తిడితో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు ఇలాంటి శిబిరాలు అభినందనీయమన్నారు. ఎమ్మెల్యేలు మహ్మద్ నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.



