ఫ్లాట్ కొంటున్నారా? ఏరియా తెలుసుకోండి!

ఫ్లాట్ కొనేముందు కార్పెట్ ఏరియా, లోడింగ్, స్క్వేర్ ఫీట్ ధర, భూమిలో మన వాటా ఎంతనేది తప్పక తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, ఫ్లాట్ కొనేటప్పుడు బిల్డర్ చెప్పే 1,250, 1,500 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణం మొత్తం మనం వాడుకునే స్థలం కాకపోవచ్చు. అందులో గోడలు, బాల్కనీతో పాటు లిఫ్ట్, మెట్లు, లాబీ వంటి ఉమ్మడి ప్రాంతాల వాటా కూడా ఉండొచ్చు. మనం నేరుగా యూజ్ చేసుకునే స్థలాన్ని కార్పెట్ ఏరియా అంటారు. గోడలు, బాల్కనీ కలిపితే బిల్ట్అప్ ఏరియా, ఉమ్మడి ప్రాంతాల వాటా కలిపితే సూపర్ బిల్ట్అప్ ఏరియా.



