మంగళగిరి కొండపై ప్లాస్టిక్ క్లీనింగ్

AP :మంగళగిరి కొండ ప్రశాంతంగా, అందంగా ఉండాలి కానీ, అక్కడ ప్లాస్టిక్ బాటిళ్లు, సిగరెట్ బాక్సులు, మందు సీసాలు ఎక్కడ పడితే అక్కడ పడేసి కనిపించాయి. ఇది చూసిన ABVP-SFD విద్యార్థులు క్లీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ రెస్పాన్సిబిలిటీగా ఉండాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించి క్లాత్ బ్యాగ్స్ వాడాలని విద్యార్థులు కోరారు. కొండపైకి వచ్చి ప్రకృతిని ఆస్వాదించాలి తప్ప చెత్త పడేసి నాశనం చేయకూడదని, పరిసరాలను నీట్‌గా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని మెసేజ్ ఇచ్చారు.



