← Back to news

గుంటూరు గ్రంథాలయంలో మట్టి వినాయకుల పంపిణీ

By SHAIK SUBHANI· 1d ago· Madugula, Madugula, Anakapalli
గుంటూరు గ్రంథాలయంలో మట్టి వినాయకుల పంపిణీ

AP: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవి భీమనేని సూచించారు. గుంటూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం మీటింగ్ హాల్‌లో వినాయక చవితిని పురస్కరించుకుని గ్రంథాలయ ఉద్యోగులు, పాఠకులు, విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని ఆమె కోరారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

More in Local