← Back to news

దుగ్గిరాల యార్డులో పసుపు ధరకు రెక్కలు

By Bala· 12h ago
దుగ్గిరాల యార్డులో పసుపు ధరకు రెక్కలు

గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు యార్డులో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మంగళవారం క్వింటా పసుపు గరిష్ఠంగా ₹18,400 పలికింది. ఈ నెల 8న ఉన్న ₹15,900తో పోలిస్తే ఐదు రోజుల్లోనే ₹2,500 పెరిగింది. కొమ్ములు, కాయలకు ఈ ధర లభించింది. ప్రస్తుతం పసుపు పంట అన్‌సీజన్ కావడంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు తెలిపారు.

More in Local