← Back to news

అలంపూర్‌లో రూ.4.60 కోట్లతో లైట్ షో

By Arjun Goud· 5d ago
అలంపూర్‌లో రూ.4.60 కోట్లతో లైట్ షో

అలంపూర్‌లో రూ.4.60 కోట్లతో ఏర్పాటు చేసిన మల్టీమీడియా సౌండ్, లైట్ షోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన అలంపూర్ ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని వెలుగు, ధ్వని సమ్మేళనంతో ప్రదర్శించేలా ఈ షోను రూపొందించారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ, ఎమ్మెల్యే విజయుడు, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఒగ్గు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది.

అలంపూర్‌లో రూ.4.60 కోట్లతో లైట్ షో
అలంపూర్‌లో రూ.4.60 కోట్లతో లైట్ షో

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.