రైతులకు పరిహారం నేరుగా అందాల్సిందే: ఉత్తమ్

TG: ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయే రైతులకు పరిహారం సకాలంలో అందకపోతే ప్రభుత్వ లక్ష్యం నెరవేరదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. పునరావాసం, అటవీ అనుమతులపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. భూసేకరణ కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.5 వేల కోట్లను నిర్వాసితులకు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధులు ఖాతాల్లో జమ చేయడం మాత్రమే కాకుండా, వాస్తవంగా భూములు కోల్పోయిన రైతులకు చేరాలని సూచించారు.



