CECపై ధ్రువ్ రాఠీ డిమాండ్

CEC జ్ఞానేష్ కుమార్‌ని తొలగిస్తే సరిపోదనీ, నెక్ట్స్ కమిషనర్‌ను PM, అపోజిషన్ లీడర్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కలిసిన ప్యానెల్‌తో నియమించాలని ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ డిమాండ్ చేశారు. 2023లో సుప్రీంకోర్టు అనూప్ బరన్వాల్ కేసులో ఈ ముగ్గురి ప్యానెల్‌ను సూచించింది. పార్లమెంట్ 2023 చట్టంతో CJI స్థానంలో కేబినెట్ మంత్రిని చేర్చి ప్రభుత్వానికి 2:1 మెజారిటీ కల్పించింది. జ్ఞానేష్ కుమార్ ఈ కొత్త విధానంతోనే 2025లో CECగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ చట్టం విచారణ సుప్రీంకోర్టులో పెద్ద బెంచ్‌కు రిఫర్ అయింది.


