షార్ట్ సర్క్యూట్తో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో కొమురయ్య పొలం వద్ద కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.



