NICLలో 321 ఉద్యోగాలు.. డిగ్రీతో ఛాన్స్!

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 321 Administrative Officer పోస్టుల భర్తీకి <a href="https://nationalinsurance.nic.co.in/recruitment">నోటిఫికేషన్</a> రిలీజ్ అయ్యింది. జనరలిస్ట్, ఫైనాన్స్, లీగల్, IT వంటి పోస్టులున్నాయి. దరఖాస్తుకు డిగ్రీలో 60 శాతం మార్కులు (SC/ST/PwBDకు 55%) అవసరం. ఏజ్ 01-10-2026 నాటికి 21–30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు SC/ST/PwBDకు ₹250, ఇతరులకు ₹1,000 ఉంటుంది. అప్లికేషన్ అక్టోబర్ 8 నుంచి 28 వరకు <a href="https://nationalinsurance.nic.co.in/recruitment">ఆన్లైన్లో అప్లై</a> చేసుకోవాలి.



