శంకరన్ 16వ వర్ధంతి.. పాడేరులో నివాళి

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎస్.ఆర్.శంకరన్ 16వ వర్ధంతి జరిగింది. పేదలు, దళితులు, ఆదివాసులు, కార్మికుల హక్కుల కోసం శంకరన్ కృషి చేశారు. సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పీ.అప్పలనర్స ఈ విషయం తెలిపారు. ప్రజలు ఆయనను పీపుల్స్ ఐఏఎస్ అని పిలిచేవారన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధర్మన్న పడాల్ వి.దాస్ తదితరులు పాల్గొన్నారు.



