ఎం.ఎస్.గిల్ విషయంలో మీరు చేసిందేంటి?: బీజేపీ

ఎలక్షన్ కమిషన్(EC) నిష్పాక్షికతను కాంగ్రెస్ పార్టీ గతంలో తీవ్రంగా దెబ్బతీసిందని BJP విమర్శించింది. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ CEC డాక్టర్ మనోహర్ సింగ్ గిల్(M. S. Gill) రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ బీజేపీ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్పై దాడి చేసింది. CECగా పనిచేసి, రిటైర్ అయిన మూడేళ్లకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని, 2004లో కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారని చెప్పారు. 2008లో UPA ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేశారన్నారు.


