← Back to news

జావా సముద్రంలో ఘోర ప్రమాదం..130 మంది గల్లంతు

By A.Ajay· 1d ago
జావా సముద్రంలో ఘోర ప్రమాదం..130 మంది గల్లంతు

ఇండోనేషియాలోని జావా సముద్రంలో 243 మందితో వెళ్తున్న ‘విర్గో ట్రాన్స్‌పోర్ట్‌ 8’ నౌక బోల్తా పడింది. సురబయా నుంచి బంజర్మసిన్‌కు వెళ్తుండగా భారీ కెరటాలు, తీవ్ర వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 108 మందిని రక్షించగా ఆరు మృతదేహాలు లభించాయి. మరో 129 మంది కోసం 600 మందికి పైగా సిబ్బంది, 17 నౌకలు, 5 హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

More in International

ఇండియన్ స్టూడెంట్స్‌పై కామెంట్స్.. బో ఫ్రెంచ్‌పై విమర్శలు!
International· 26m ago

ఇండియన్ స్టూడెంట్స్‌పై కామెంట్స్.. బో ఫ్రెంచ్‌పై విమర్శలు!

అమెరికా రిపబ్లికన్ నేత బో ఫ్రెంచ్.. టెక్సాస్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇండియన్, దక్షిణాసియా స్టూడెంట్స్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. వారిని ‘ఫారినర్స్’గా పేర్కొంటూ అమెరికన్ల అవకాశాలను విదేశీయులు ఆక్రమిస్తున్నారంటూ <a href="https://x.com/bofrench/status/2099142867025383497?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2099142867025383497%7Ctwgr%5Ec8711a43d9b2e368f69e96dcb84abc21f32eb28b%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.firstpost.com%2Fworld%2Fbo-french-splits-us-mid-term-elections-with-his-racist-remarks-targeting-indian-students-14046020.html">'X'లో</a> పోస్టు చేశారు. దీంతో ఆయనపై రేసిజం, జెనోఫోబియా ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ నేతలు, సెనేటర్ జాన్ కార్నిన్ కూడా ఫ్రెంచ్ కామెంట్స్‌ను తప్పుబట్టారు. ఆయన మాత్రం తన కామెంట్స్‌పై వెనక్కి తగ్గకుండా సమర్థించుకున్నారు.