← Back to news

జగిత్యాల మహిళా రైతుకు జాతీయ అవార్డు

By Srikanth Goud· 1d ago· Jagitial, Jagitial, Jagitial
జగిత్యాల మహిళా రైతుకు జాతీయ అవార్డు

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన మహిళా రైతు బండారి విజయ జాతీయ స్థాయి ‘మహిళా కిసాన్ దివస్’ అవార్డుకు ఎంపికయ్యారు. తనకున్న ఎకరం పొలంలో 14 రకాల కూరగాయలు సాగు చేస్తూ, అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. విభిన్న సాగు పద్ధతులతో వ్యవసాయంలో రాణిస్తున్న విజయను జిల్లా వ్యవసాయ అధికారులు అవార్డుకు ప్రతిపాదించారు. ఆమె సాగు విధానాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది.

జగిత్యాల మహిళా రైతుకు జాతీయ అవార్డు
జగిత్యాల మహిళా రైతుకు జాతీయ అవార్డు

More in Local