Art + Fashion

ఫ్యాషన్ ప్రపంచంలో కళ (Art) సరికొత్తగా మారుతుంది. డిజైనర్లు, లగ్జరీ బ్రాండ్ల పెయింటింగ్స్, శిల్పకళను డ్రెస్సులు, యాక్సెసరీలలో కలిపి కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నారు. డాలీ ఆర్ట్‌ను పోలిన పెదవుల బ్రోచ్, తరుణ్ తహిలియాని 'పిచ్వాయ్ ఆర్ట్' జంప్‌సూట్, అనామికా ఖన్నా 'పటాచిత్ర' కోట్లతో పాటు డోల్చే అండ్ గబ్బానా టీషర్ట్‌లు డిజైనర్ వేర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. లూయిస్ విటన్ బ్యాగులు, వెరైటీ డిజైన్ వాచీలు, సన్‌గ్లాసెస్ వింటేజ్ అండ్ మోడ్రన్ లుక్ ఇస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.



