ఏపీ, తమిళనాడు సీఎంల భేటీ

ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్ భేటీ అయ్యారు. చెన్నైకి తెలుగు గంగ ద్వారా తాగునీటి సరఫరా, గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై ఈ మీటింగ్లో డిస్కస్ చేశారు. చెన్నై నీటి అవసరాల కోసం ఏపీ నుంచి రావాల్సిన వాటర్ కోటాను మరింత పెంచాలని తమిళనాడు కోరగా, గోదావరి జలాల మళ్లింపు ప్రతిపాదనలపై ఇద్దరు సీఎంలు చర్చలు జరిపారు.


