పెళ్లి పేరుతో వేధింపులు.. సౌరవ్ గుజ్జర్‌పై కేసు

TG: గచ్చిబౌలిలో యాక్టర్, రెజ్లర్ సౌరవ్ గుజ్జర్‌పై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఫిజికల్‌గా, మెంటల్‌గా వేధించాడని ఓ యువతి ఆగస్టు 15న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2021లో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరూ సన్నిహితంగా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి, వ్యాపారం పేరుతో ఉద్యోగం మానేసి వచ్చినట్లు తెలిపింది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి ముంబై ఎయిర్‌పోర్టులో సౌరవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.


