← Back to news

హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్‌ సుప్రీంకోర్టుకు!

By Mahesh· 14h ago· TG
హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్‌ సుప్రీంకోర్టుకు!

TG: హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సవాల్ చేస్తూ MLA దానం నాగేందర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇవాళ SLP ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో బీజేపీ MLA ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ MLA పాడి కౌశిక్‌రెడ్డి ఇప్పటికే కేవియట్ ఫైల్ చేశారు. BRS టికెట్‌పై ఖైరతాబాద్ నుంచి గెలిచి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్‌గా పోటీ చేసిన నేపథ్యంలో హైకోర్టు దానం మెంబర్‌షిప్‌ను రద్దు చేసి, 2024 ఏప్రిల్ 23 నుంచి <a href="https://www.theclearcutnews.com/n/mm8pH4D">అనర్హత వర్తిస్తుందని తెలిపింది.</a> ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది.

More in TG

ఆరుట్లలో ప్రభుత్వ బడికి కొత్త రూపు.. ఇది కదా కావాల్సింది!
TG· 15h ago

ఆరుట్లలో ప్రభుత్వ బడికి కొత్త రూపు.. ఇది కదా కావాల్సింది!

TG: రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్.. ప్రభుత్వ విద్యలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకూ.. ఒకే క్యాంపస్‌లో ఇంగ్లీష్ మీడియం విద్య అందుతోంది. డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, డైనింగ్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్‌తో పాటూ.. విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ దాదాపు 1,800 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇలాంటి స్కూల్స్ మరిన్ని రావాలనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే <a href="https://www.theclearcutnews.com/n/9RMisjV">TPF విద్యా బస్సుయాత్ర</a> కొనసాగుతోంది.