మల్లారెడ్డి కన్నుమూత.. రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు

TG: సారంపల్లి మల్లారెడ్డి మృతి దేశ వామపక్ష, రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్. శ్రీనివాసులు అన్నారు. నాగర్‌కర్నూల్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో మల్లారెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతుల హక్కులు, సాగునీరు, విద్యుత్ సమస్యలపై మల్లారెడ్డి అలుపెరగని పోరాటాలు చేశారని గుర్తుచేశారు. విద్యుత్ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.



