ఉత్సవాల నిర్వహణకు సహకారం.. సర్పంచ్కు సన్మానం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో దుర్గాదేవి ఉత్సవాల నిర్వహణకు సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య సహకారం అందించారు. అంబేద్కర్ నవయువ యూత్ దుర్గాదేవి ఉత్సవ కమిటీకి సౌండ్ సిస్టమ్తో పాటు బాక్సులను విరాళంగా అందజేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంతో పాటు యువత భక్తి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం అభినందనీయమని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సర్పంచ్ మల్లయ్యను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.



