ఐదు మండలాలకు సీపీఎం అభ్యర్థులు ఖరారు

అల్లూరి జిల్లాలో ఐదు మండలాలకు CPM పార్టీ జడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేసింది. అరకులోయకు గెమ్మెలి చినబాబు, అనంతగిరికి దీసరి దేముడమ్మ, డుంబ్రిగుడకు సోనబారికి పోతురాజు, ముంచింగిపుట్టుకు కొర్రా త్రినాధ్‌ను ఎంపిక చేసింది. పాడేరు నియోజకవర్గంలోని జీకే వీధి మండలానికి అంపరంగి బుజ్జిబాబును అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్నికల బరిలో పార్టీ తరఫున వీరు పోటీ చేయనున్నారు.



