నేతలు ఆందోళన.. గాంధీభవన్‌లో ఉద్రిక్తత

TG: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు మరొసారి గొడవలకు దిగారు. కాంగ్రెస్ నేత చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రశేఖర్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి చంద్రశేఖర్ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సంస్థాగత నియమాకాల్లో ఆయన తన వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

