దద్దరిల్లుతున్న ధర్నాచౌక్
AP: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. 'ఛలో విజయవాడ' ఆందోళన చేపట్టారు. ధర్నాచౌక్ దగ్గరకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఐతే.. దీనికి అనుమతి ఇవ్వని పోలీసులు ధర్నాచౌక్‌ని దిగ్బంధించారు. ఉద్యోగులు రాకుండా అన్ని వైపులా బారికేడ్లతో మూసేశారు. అలాగే.. ఎక్కడికక్కడ సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఎలాగైనా ఆందోళన చేసి తీరతామన్న ఉద్యోగులు.. లెనిన్ సెంటర్‌కి చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉంది.


