క్రికెట్ ఆడుతూ 25 ఏళ్ల కుర్రాడు మృతి.
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో విషాదం జరిగింది. సన్లేటి గ్రామానికి చెందిన 25 ఏళ్ల రామ్‌రాజ్ మీనా క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా ఛాతినొప్పితో కుప్పకూలిపోయాడు. స్నేహితులు వెంటనే అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. గుండెపోటు కారణంగా మృతి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రామ్‌రాజ్‌కు ఐదు నెలల క్రితమే వివాహం జరిగింది.


