ఆల్ఫోర్స్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలను

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ, వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి పూజించడం ఈ పండుగ ప్రత్యేకత అని చెప్పారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి ఆడుకునే వేడుక తెలంగాణ ప్రజల జీవనశైలిలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని తెలిపారు.



