గ్రామ సభలపై అధికారుల నిర్లక్ష్యం.. రమణ ఫైర్!

ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక, ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో గ్రామసభలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలోని 243(A), పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 6, జీవో 791 ప్రకారం గ్రామసభలు జరగాలి. సంవత్సరానికి నాలుగుసార్లు ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరిలో నిర్వహించాలి. కానీ షెడ్యూల్ విడుదల చేయకుండా ఒకేరోజు సభలు జరిపిస్తున్నారని ఆయన అన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామసభల ద్వారానే సాధ్యమని రమణ పేర్కొన్నారు.


