అంగన్‌వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ

AP: కాకినాడ జిల్లా రౌతులపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్‌వాడీకార్యకర్తలకు జ్ఞానజ్యోతి రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణలో అంగన్‌వాడీ విద్యలో సమ్మేళిత విద్య (Inclusive Education)ను ఎలా అమలు చేయాలి, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను అంగన్‌వాడీ బోధనలో ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి అనే అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ప్రతి చిన్నారిని సమానంగా విద్యా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా అంగన్వాడీ కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.




