ఏనుగుల విధ్వంసం.. పరిహారమేది?

పార్వతీపురం మన్యం జిల్లా బామిని మండలం సులకొజ్జు గ్రామంలో 20 రోజులుగా 4 ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇవి 50 నుంచి 100 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేశాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు పరిశీలించారు. ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని, ఏనుగులను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. అటవీశాఖ అధికారులు పంటలను, ప్రజలను కాపాడాలని కోరారు. కె. చంద్రయ్య, మోహనరావు, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



