ఇక్కడ రేవంత్ చట్టం నడుస్తోంది..!

హైదరాబాద్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో మాస్కులు ధరించిన వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టాలని కోరారు. తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. హోంమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. "తెలంగాణలో రాజ్యాంగం కాదు.. రేవంత్ రెడ్డి చట్టం నడుస్తోంది" అని మండిపడ్డారు.



