బరి నుంచి మీనాక్షీ ఔట్- ఎంపీలో బీజేపి క్లీన్ స్వీప్

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో.. ఎలాంటి పోటీ లేకుండానే బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ అభ్యర్థులు రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ధృవీకరించింది. నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, విచారణ వాయిదా పడటంతో బీజేపీ విజయం ఖాయమైంది. దీంతో హోరాహోరీగా సాగుతుందనుకున్న పోరు కాస్తా.. ఏకపక్ష ముగింపుగా మారింది.


