← Back to news

కులాంతర వివాహం చేసుకుంటే ఇల్లు కూల్చేస్తారా?

By VEMANNA· 1d ago· Jogulamba Gadwal
కులాంతర వివాహం చేసుకుంటే ఇల్లు కూల్చేస్తారా?

గద్వాల మండలం రేపల్లెలో కులాంతర పెళ్లి చేసుకున్నారని దళిత యువకుడి ఇంటిని కూల్చేయడాన్ని CPM నాయకుడు జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు. గద్వాల అంబేద్కర్ చౌక్‌లో దళిత సంఘాలతో కలిసి నిరసన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, ఇల్లు కూల్చేయించిన సర్పంచ్‌పై SC,ST అట్రాసిటీ కేస్ పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, పోలీసులు వాళ్లకు ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు.

More in Local