నాగోల్‌లో దారుణ హత్య.. రౌడీషీటర్ మృతి!

హైదరాబాద్ నాగోల్ పరిధిలోని బండ్లగూడలో దారుణ హత్య చోటుచేసుకుంది. వైన్స్ షాపులో ఉన్న ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ నయీమ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం కారులో అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దీంతో పాత కక్షల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియల్సి ఉంది.



