ప్రభుత్వ విద్యావిధానం ఐసీయూలో ఉంది: ఆకునూరి

TG: హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం నుంచి రిటైర్డ్ IAS ఆకునూరి మురళి విద్యా బస్సుయాత్రను ప్రారంభించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే ఈ యాత్ర లక్ష్యంగా తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్, టీచర్ల సమస్యలపై అవగాహన కల్పించేందుకు యాత్ర కొనసాగనుంది. విద్యాహక్కులు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు.



