రింతాడలో సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ గ్రామపంచాయతీకి చెందిన మడపల వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులు దసరా సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. తమ పూర్వీకులు ఉపయోగించిన ఆయుధాలకు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు చేశారు. ఈ ఆయుధాలు పూర్వీకుల ధైర్యసాహసాలు, ఆత్మగౌరవం, కుటుంబ చరిత్రకు ప్రతీకలని తెలిపారు. కాలం మారుతున్నా ఆచార సంప్రదాయాలను మరచిపోకుండా భావితరాలకు అందించాలని చెప్పారు.




