← Back to news

వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· B R Nagar, Mangalagiri, Guntur
వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

తాడేపల్లిలోని శ్రీ త్రిపుర తాండవేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అక్టోబర్ 20 వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజూ విశేష అలంకరణలు, పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

More in Local