SC, ST కమిషన్లకు అధికారాలు కల్పించాలి: కవిత

TG: హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో SC, ST ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మాట్లాడారు. SC, ST కమిషన్లకు అమలు చేయగల అధికారాలు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలన్నారు. SC, STలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెండు వర్గాల సమస్యలు భిన్నంగా ఉంటాయని, ప్రత్యేక కమిషన్ల ఏర్పాటు ద్వారా బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.



