← Back to news

ఒకే రోజు రెండు పరీక్షలు.. నిరుద్యోగుల టెన్షన్!

By Anusha· 2d ago

తెలంగాణలో సివిల్ ఇంజనీరింగ్ నిరుద్యోగులు TGPSC కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. నవంబర్ 6న R&B AEE, SSC JE ఎగ్జామ్స్ ఒకే రోజు ఉండటంతో AEE పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్కువ పోస్టులు ప్రకటించిందని, రెండు ఎగ్జామ్స్ ఒకే రోజు ఉండటం వల్ల నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష తేదీలు మార్చాలని గత 10 రోజులుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పరీక్ష తేదీలు మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

More in TG