మిలాద్-ఉన్-నబీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

TG: ఈ నెల 26న మిలాద్-ఉన్-నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎస్‌డీపీవో శాంతి కమిటీ సభ్యులతో పండుగ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై చర్చించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. మత సామరస్యాన్ని కాపాడుతూ పండుగను సంతోషంగా నిర్వహించాలని కోరారు.



