ఎల్‌నినోపై పలమనేరులో రైతులకు అవగాహన

ఎల్‌నినో ప్రభావంతో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లకు మేత, నీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. పశు పరిశోధనా కేంద్రంలో రైతులు, పశుపోషకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తీవ్ర ఎండల్లో జీవాలకు నీడ, గాలి, చల్లని తాగునీరు అందించాలని, ఎండుగడ్డి, సైలేజ్ ముందుగానే నిల్వ చేసుకోవాలని చెప్పారు. పశుగ్రాసం, అంతర పంటల సాగు ప్రోత్సహించాలని, వ్యాధుల నివారణకు సకాలంలో టీకాలు వేయించాలని తెలిపారు. డా. జి. భారతి, డా. పి. అరుణ, కేంద్ర సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.




