కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీ

CRPF కోబ్రా యూనిట్ ఐజీగా 2006 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్ IPS అధికారిణి సంజుక్తా పరాశర్ పోస్టింగ్ పొందారు. ఈ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళగా ఆమె నిలిచారు. 1996 బ్యాచ్ అధికారి దనేష్ రాణా స్థానంలో బాధ్యతలు చేపట్టారు. అస్సాం, ఎన్‌ఐఏలో సేవలందించిన సంజుక్తా పరాశర్ అడవుల్లో పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. మావోయిస్టులు, ఈశాన్య తిరుగుబాటుదారులను ఎదుర్కొనే కోబ్రా దళంలో ఆమెకు అనుభవం ఉంది.


