← Back to news

దుండిగం పంచాయతీలో SMC ఎన్నికలు.. ప్రశాంతం!

By Mutyala Giri· 1h ago· Damavaram, Dagadarthi, Sri Potti Sriramulu Nellore
దుండిగం పంచాయతీలో SMC ఎన్నికలు.. ప్రశాంతం!

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దుండిగం గ్రామపంచాయతీలో SMC ఎన్నికలు జరిగాయి. మండల ఇన్‌చార్జి పమిడి రవికుమార్ చౌదరి ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చైర్మన్‌గా దేవరపాటి మాధురి ఎన్నికయ్యారు. మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా దేవరపాటి నరేష్, వైస్ చైర్మన్‌గా ఉసురుపాటి మహేంద్ర ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఉసురుపాటి సుధాకర్, దేవరపాటి అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

More in Local